ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

by Naga Rani Yarlagadda |

గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై..

ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్పోరాలోని నైట్ క్లబ్ లో గ్యాస్ సిలిండర్ పేలి 23 మంది మరణించడం తనను ఎంతో బాధించిందని ఎక్స్ లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై తాను సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు చెప్పారు. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, కేంద్రప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story