- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే ‘యూసీసీ’ పక్కా: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం ముర్షిదాబాద్ జిల్లాలోని జాంగీపుర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ‘ఉమ్మడి పౌర స్మృతి’ (UCC)ని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బుజ్జగింపు రాజకీయాలకు (Appeasement Politics) శాశ్వతంగా స్వస్తి పలకడానికే పశ్చిమ బెంగాల్‌లో యూసీసీని అమలు చేయాలని బీజేపీ నిర్ణయించుకుందని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బెంగాలీలు సొంత గడ్డపైనే మైనార్టీలుగా మారిపోయే ప్రమాదం ఉందని, బీజేపీ ఆ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వదని ఆయన భరోసా ఇచ్చారు.
యూసీసీ (UCC) అంటే ఏమిటి?
యూసీసీ (UCC) అనగా Uniform Civil Code (ఉమ్మడి పౌర స్మృతి). దేశంలోని పౌరులందరికీ వారి మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ఒకే దేశం - ఒకే చట్టం ఉండాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, వారసత్వం, పిల్లల దత్తత వంటి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర మతాలకు వారి వారి సొంత వ్యక్తిగత చట్టాలు (Personal Laws) ఉన్నాయి.
యూసీసీ వస్తే ఏమవుతుంది?
ఈ చట్టం అమల్లోకి వస్తే, మతపరమైన వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. దేశంలోని పౌరులందరికీ ఒకే కామన్ చట్టం వర్తిస్తుంది. అందరికీ ఒకే విధమైన హక్కులు, నియమాలు ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని సూచిస్తోంది.






