- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PPC : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’
విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి, భయాందోళనను పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి, భయాందోళనను పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రోగ్రామ్ ఈ అరుదైన ఘనతను సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నిర్వహించిన 8వ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి నెలరోజుల్లో సుమారు 3.53 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 21 కోట్ల మందికి పైగా టీవీల్లో ఈ ప్రోగ్రామ్ ను చూడటం ద్వారా ఇంతటి ఘనత సాధించగలిగిందని, దీనిని విజయంవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) సిబ్బంది ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, జితిన్ ప్రసాద తదితరులు పాల్గొన్నారు. 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలో తొలిసారి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించగా.. విద్యార్థులు, స్కూళ్ల యాజమాన్యం, తల్లిదండ్రుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.






