- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతికూల వాతావరణం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
దట్టమైన మంచు కారణంగా లో విజిబిలిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) హెలికాప్టర్ శనివారం పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా తాహర్‌పూర్ (Taharpur)లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ల్యాండ్ కాలేదు.

దిశ, వెబ్‌డెస్క్: దట్టమైన మంచు కారణంగా లో విజిబిలిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) హెలికాప్టర్ శనివారం పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా తాహర్‌పూర్ (Taharpur)లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ల్యాండ్ కాలేదు. దీంతో హెలీప్యాడ్ పైన కొంతసేపు తిరిగిన తర్వాత హెలికాప్టర్ యూ-టర్న్ తీసుకుని కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేరింది. కాగా, ఇవాళ ఉదయం సుమారు 10.40కి ప్రధాని మోడీ కోల్‌కతాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నాదియా జిల్లాలోని తాహర్‌పూర్‌కు బయలుదేరారు. అక్కడ ఆయన పశ్చిమ బెంగాల్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించే అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం బీజేపీ నిర్వహిస్తున్న ‘పరివర్తన్ సంకల్ప సభ’ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాల కోసం ప్రధాని ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. లో విజిబిలిటీ మెరుగుపడితే మరోసారి హెలికాప్టర్‌లో లేదా రోడ్డు మార్గంలో వెళ్లాలా అనే విషయంపై స్పష్టత రానుంది.






