MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్: ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

బిహార్‌లో ఎన్డీఏ(NDA) కూటమిపై విశ్వాసం చూపిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ధన్యవాదాలు చెప్పారు.

MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో ఎన్డీఏ(NDA) కూటమిపై విశ్వాసం చూపిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ధన్యవాదాలు చెప్పారు. శుక్రవారం ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు సత్కరించారు. అనంతరం మోడీ ప్రసంగించారు. వికసిత్‌ బిహార్‌ కోసం ప్రజలు ఓటేశారని అన్నారు. బిహార్‌లో అతి గొప్ప విజయం సాధించామని తెలిపారు. ప్రతిపక్షాల అబద్ధాలను ప్రజలు నమ్మలేదు.. బిహార్‌ అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రజలు అన్ని రికార్డులు బద్దలుగొట్టారు.. బిహార్‌ విజయం జేపీ నారాయణ్‌కు మోడీ అంకితం చేశారు.

కొందరు MY ఫార్ములాతో విజయం సాధించాలనుకున్నారు.. కానీ మా MY ఫార్ములా అంటే మహిళలు, యూత్ అని అన్నారు. నితీష్‌ నేతృత్వంలో అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.. జమ్మూ, ఒడిశాలో గెలిచిన BJP అభ్యర్థులకు కూడా అభినందనలు చెప్పారు. ఈ విజయంతో ఈసీపై ప్రజలకు కూడా నమ్మకం పెరిగిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. ఒకప్పుడు బిహార్‌లో అరాచక శక్తులుండేవి.. ఈవీఎంలు లూటీ చేసేవారు.. పోలింగ్‌ కూడా సరిగా జరిగేది కాదు.. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేశారు.. ఈసారి ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగింది.. SIRకు బిహార్‌ ఓటర్లు మద్దతు ఇచ్చారని మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించాం. కాంగ్రెస్‌ కొన్ని దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించింది. కానీ ప్రజలకు ఆ పార్టీమీద క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ MMCగా మారింది. MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్ అని మోడీ అభివర్ణించారు.

Next Story