Pm modi: దేశ భవిష్యత్‌కు యువతే మూలధనం.. రోజ్ గార్ మేళాలో ప్రధాని మోడీ

by B.Srinivas |

భారతదేశ ఉజ్వల భవిష్యత్‌కు యువతే మూలధనం అని ప్రధాని మోడీ అన్నారు. రోజ్ గార్ మేళాలో నియామకపత్రాలు పంపిణీ చేశారు.

Pm modi: దేశ భవిష్యత్‌కు యువతే మూలధనం.. రోజ్ గార్ మేళాలో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ ఉజ్వల భవిష్యత్‌కు యువతే మూలధనం అని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. శనివారం జరిగిన 16వ రోజ్ గార్ మేళా (Rozghar mela) లో 51000 మందికి ఉద్యోగ నియామకపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ‘భారత్‌లో జనాభా, ప్రజాస్వామ్యం అనే రెండు అపారమైన శక్తులు ఉన్నాయని ప్రపంచం అంగీకరిస్తోంది. అంటే అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం. యువత బలం దేశానికి మూలధనం. ఈ మూలధనాన్ని శ్రేయస్సు కోసం ఒక సూత్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని అన్నారు.

ఇటీవల ఐదు దేశాల్లో కుదిరిన ఒప్పందాలు యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నొక్కి చెప్పారు. తయారీ, సేవా రంగాలకు తోడ్పడతాయన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు.భారతదేశంలో అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని, గొప్ప సమానత్వం వైపు పురోగమిస్తున్నామని చెప్పారు. కాగా, 16 ఎడిషన్ రోజ్‌గార్ మేళాతో మొత్తం నియామకాల సంఖ్య పది లక్షలకు చేరికుంది.

Next Story