మ‌లేషియాలో రామాయ‌ణం..వీక్షించిన ప్ర‌ధాని మోడీ

by velandi.Saikiran |

మలేషియాలో ఉన్న స్థానిక కళాకారులు ప్రదర్శించిన ఈ తోలు బొమ్మలాటను వీక్షించి తెగ సంబరపడిపోయారు ప్రధాని నరేంద్ర మోడీ.

మ‌లేషియాలో రామాయ‌ణం..వీక్షించిన ప్ర‌ధాని మోడీ
X

దిశ‌, వెబ్ డెస్‌: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం మలేషియా ( Malaysian ) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల మలేషియా పర్యటనలో భాగంగా శనివారం రోజు, కౌలాలంపూర్ ( capital Kuala Lumpur ) చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అయితే ఈ మలేషియా పర్యటన నేపథ్యంలో తోలు బొమ్మలాటను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు.

తోలు బొమ్మలాటను వీక్షించిన ప్రధాని మోడీ

మలేషియాలో ఉన్న స్థానిక కళాకారులు ప్రదర్శించిన ఈ తోలు బొమ్మలాటను వీక్షించి తెగ సంబరపడిపోయారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో భాగంగా రామాయణ కథాంశాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ఉమ్మడి సంస్కృతిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు. దేశాలపై రామాయణం ప్రభావాన్ని హైలెట్ చేస్తుందని కూడా పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

అటు ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వారధిగా ప్రవాస భారతీయులు నిలుస్తున్నారని కొనియాడారు. ఇండియా అటు మలేషియా రెండు దేశాల భాగస్వామ్యం.. మంచి భవిష్యత్తుకు నాంది పలుకుతుందని వెల్లడించారు. ఎంతో ఆత్మీయంగా ప్రవాసులు తనకు స్వాగతం పలికారని, వాళ్లకి చివరి వరకు రుణపడి ఉంటానని కూడా స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అదే సమయంలో ఇండియా , మలేషియా దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Next Story