- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెక్నాలజీకి బానిసలవ్వొద్దు.. విద్యార్థులకు మోడీ సలహా
టెక్నాలజీకి బానిసలవ్వొద్దని, దాంతో నైపుణ్యాలను పెంచుకోవాలని విద్యార్థులకు మోడీ సలహా ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: టెక్నాలజీకి విద్యార్థులు బానిసలుగా మారకూడదని ప్రధాని మోడీ సూచించారు. దాన్ని సాధనంగా ఉపయోగించుకొని తమ నైపుణ్యాలు పెంచుకోవాలని విద్యార్థులకు చెప్పారు. ‘పరీక్షా పే చర్చా’ రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహతి, గుజరాత్‌కు చెందిన విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. టీవీ, మొబైల్ లేకుండా ఆహారం కూడా తినలేని పిల్లలు ఆ టెక్నాలజీకి బానిసలైపోయినట్లేనన్నారు. ఏఐ వంటి కొత్త టెక్నాలజీలను చూసి ఆందోళన చెందొద్దని, వాటిని ఉపయోగించుకొని నైపుణ్యాలతోపాటు సామర్థ్యాన్ని పెంచుకోవాలని మోడీ సలహా ఇచ్చారు. అలాగే పరీక్షల కోసం చక్కగా సిద్ధమైతే టెన్షన్ ఉండదని, పరీక్ష ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోవాలని చెప్పారు. అలా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తను చదువుకునే రోజుల్లో టీచర్ల పాత్రను కూడా గుర్తుచేసుకున్న ప్రధాని.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్సర్‌సైజులు చేయాలని తన టీచర్లు బలవంతపెట్టేవారని తెలిపారు.






