రేపు ప్రధాని మోడీ వారణాసిలో పర్యటన

by Yella Dhawani Reddy |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) శనివారం వారణాసిలో పర్యటించనున్నారు.

రేపు ప్రధాని మోడీ వారణాసిలో పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) శనివారం (ఆగస్టు 2) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ రూ.2,183.45 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. అలాగే, రక్షాబంధన్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Yojana) 20వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దేశంలోని 9.7 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లకుపైగా నిధులను నేరుగా బదిలీ చేయనున్నారు. అయితే, ఈ నిధుల్లో ఎక్కువ భాగం యూపీకే చెందనుంది. ఎందుకంటే, ఆ రాష్ట్రంలో 2.3 కోట్ల మందికి పైగా రైతులుండగా.. వారికి రూ.4,600 కోట్లకు పైగా మంజూరుకానున్నాయి. ఇక కేవలం వారణాసిలోని రైతులకు మాత్రమే చూసుకుంటే, అక్కడి 2.21 లక్షల మంది అన్నదాతలకు రూ.48 కోట్లు అందించనున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా, రేపు 20వ విడత నిధులు అందనున్నాయి.

Next Story