- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు దేశాల పర్యటనకు మోడీ.. ఇథియోపియాలో తొలిసారి పర్యటన
మూడు దేశాల పర్యటనకు వెళ్లేందుకు ప్రధాని మోడీ సిద్ధమవుతున్నారు. ఇథియోపియాలో తొలిసారి పర్యటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. డిసెంబరు 15 నుంచి 18వ తేదీ వరకు మూడురోజుల్లో ఈ మూడు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో భారత్‌కు కీలక భాగస్వాములైన ఈ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని ముందుగా ఆ దేశానికి వెళ్తారని.. ఆయనతో భారత్-జోర్డాన్ బంధాల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు కూడా గడవనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది.
అక్కడి నుంచి ఇథియోపియా చేరుకొని, ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీయ్ అహ్మద్ అలీని ప్రధాని మోడీ కలుస్తారు. ఇథియోపియాకు వెళ్లడం ప్రధాని మోడీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఒమన్ చేరుకొని, ఆ దేశ రాజు సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్‌ను భారత ప్రధాని కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య 70 ఏళ్ల బంధాన్ని పురస్కరించుకొని ఇరువురు నేతలకు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఇది ఒమన్‌లో మోడీకి రెండో పర్యటన కూడా కావడం గమనార్హం. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నేరుగా భారత్‌కు చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది.






