- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో 4 వందేభారత్ రైళ్లకు జెండా ఊపనున్న ప్రధాని మోడీ
by Muthe.Rajitha |
మరో 4 వందేభారత్ రైళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపనున్నారు. మరో 4 వందేభారత్ రైళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మరో 4 వందేభారత్ రైళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపనున్నారు. నవంబర్ 8న వారణాసిలో పర్యటించనున్న మోడీ.. ఆరోజు ఉదయం 8:15 గంటలకు 4 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైళ్లు బనారస్-ఖజురహో ( వయా వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్), లఖ్‌నవూ-సహరన్‌పుర్ (వయా సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్), ఫిరోజ్‌పుర్-దిల్లీ (వయా బఠిండా, పటియాలా), ఎర్నాకుళం-బెంగళూరు (కేరళ, తమిళనాడు, కర్ణాటక) మార్గాల్లో నడుస్తాయి. ఈ 4 రైళ్లు ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రధాన నగరాలను కలుపుతూ నడవటమే కాకుండా.. ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గించనున్నాయి.
Next Story






