Pm modi: ఆ స్పీచ్ రెచ్చగొట్టేలా ఉంది.. మోడీ ప్రసంగంపై పాక్ రియాక్ట్

by B.Srinivas |

పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.

Pm modi: ఆ స్పీచ్ రెచ్చగొట్టేలా ఉంది.. మోడీ ప్రసంగంపై పాక్ రియాక్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ స్పీచ్‌పై పాకిస్థాన్ స్పందించింది. మోడీ స్పీచ్ రెచ్చగొట్టేలా ఉందని, ఆ వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేగాక ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ‘భారత ప్రధాని రెచ్చగొట్టే ప్రకటనలను పాక్ తిరస్కరిస్తోంది. భారత్ ప్రాంతీయ స్థిరత్వం దాని పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో జరిగే ఏదైనా దురాక్రమణకు పూర్తి దృఢ సంకల్పంతో ప్రతిస్పందిస్తాం’ అని పేర్కొంది.

కాగా, పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారంగా మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకేలోని) ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అనంతరం జరిగిన చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఆపరేషన్ పై మోడీ మాట్లాడుతూ పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాక్ స్పందించింది.

Next Story