పాక్‌ను కూడా చేసింది.. మీరు మాత్రం పార్లమెంట్ సెషన్ పెట్టరా? మోడీకి ఖర్గే ప్రశ్న

by Phanindra |   (  Updated:2025-06-02 18:25:37  IST  )

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో సొంత డబ్బా కొట్టుకోవడం ఆపాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే సలహా ఇచ్చారు. పాక్‌ను చూసైనా పార్లమెంట్ సెషన్ పెట్టాలన్నారు.

పాక్‌ను కూడా చేసింది.. మీరు మాత్రం పార్లమెంట్ సెషన్ పెట్టరా? మోడీకి ఖర్గే ప్రశ్న
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక పార్లమెంటరీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌ను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని, భారత్-పాక్ ఉద్రిక్తతలపై వాళ్లు పార్లమెంటరీ సెషన్ ఏర్పాటు చేసుకున్నారని ఖర్గే చెప్పారు. జాతీయ భద్రత విషయంలో దేశమంతా ఒక్కటై భద్రతా దళాలకు మద్దతుగా నిలిచిందని చెప్పిన ఆయన.. మిలటరీ చర్యలనే పొలిటిసైజ్ చెయ్యొద్దని రాజకీయ నాయకులకు సలహా ఇచ్చారు. ‘జాతీయ భద్రత విషయంలో దేశంలోని నాయకులంతా సైలెంట్‌గా ఉండటం మంచిది. ఏం జరిగిందో తెలుసుకునే వరకు మాట్లాడకపోవడమే బెటర్. డిలిగేషన్ రిపోర్టులు వచ్చే వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదు. పీఎం మోడీ కూడా ఎన్నికల ప్రసంగాలు ఇవ్వకూడదు. సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దేశమంతా భద్రతా దళాలకు మద్దతుగా నిలబడింది’ అని ఖర్గే చెప్పారు.

మిలటరీకి పూర్తి అథారిటీ ఇచ్చానని మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఖర్గే స్పందించారు. ‘మోడీ మళ్లీ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారు? తనను తాను గొప్పగా చూపించుకునే ప్రసంగాలు ఆయన చేసుకోకూడదు. పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడదామని మేం చెప్పాం. పాకిస్తాన్ కూడా పార్లమెంట్ సెషన్ పెట్టుకొని మాట్లాడుకుంటోంది. మేం ఎవరం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడబోం’ అని ఆయన స్పష్టం చేశారు.

Next Story