ఏఐతో భవితకు పునాదులు.. ఈ విషయంలో మాది ‘మానవ్’ విజన్: మోడీ

by Phanindra |

ఏఐతో భవితకు పునాదులు వేస్తామని, ఈ విషయంలో మాది ‘మానవ్’ విజన్ అని మోడీ చెప్పారు.

ఏఐతో భవితకు పునాదులు.. ఈ విషయంలో మాది ‘మానవ్’ విజన్: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో భారత్ ‘మానవ్’ విజన్‌తో ముందుకెళ్తోందని ప్రధాని మోడీ చెప్పారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’కు హాజరైన వరల్డ్ లీడర్స్‌ను ఉద్దేశించి ఆయన గురువారం నాడు ప్రసంగించారు. మానవ్ అంటే హిందీలో ‘మనిషి’ అని అర్థమని వివరించిన ఆయన.. ఏఐకు ఉండాల్సిన ఐదు లక్షణాలను ఇది సూచిస్తుందన్నారు. ‘మోరల్, ఎథికల్ వ్యవస్థ; అకౌంటబుల్ గవర్నెన్స్; నేషనల్ సావరినిటీ (ముఖ్యంగా డేటా విషయంలో); యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ టెక్నాలజీ; వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ సిస్టమ్స్’. ఈ ఐదు లక్షణాల తొలి అక్షరాలు కలిపి ‘మానవ్’ విజన్‌తో తాము ముందుకెళ్తున్నట్లు మోడీ తెలిపారు.

ఏఐ అనేది వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ కనిపెట్టినంత గొప్ప సృష్టి అని ప్రధాని కొనియాడారు. కేవలం మెషీన్లకు తెలివితేటలు ఇవ్వడమే కాకుండా, మానవుల సామర్థ్యాలను ఏఐ పెంచడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మనుషులు, తెలివైన సిస్టమ్స కలిసి పనిచేసి, మెరుగై, కొత్త అంశాలను కనిపెట్టే దశలోకి ప్రవేశిస్తున్నామన్నారు. కొందరు ఏఐ వల్ల నాశనం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారని, కానీ భారత్ మాత్రం ఏఐతో తన భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకుంటోందని వివరించారు. ఏఐకి మనుషులు కేవలం డేటా పాయింట్లేనని, ఇలా మనుషులు ముడిపదార్థాలుగా ఉండిపోకూడదంటే.. ఏఐని కూడా డెమొక్రటైజ్ చేయాలని సూచించారు. ఏఐకి అంతులేని అవకాశాలిచ్చినా, నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు. నేడు ఏఐని ఎటు తీసుకెళ్తామో, ఆ నిర్ణయమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని మోడీ స్పష్టంచేశారు.

Next Story