అర్జెంటీనాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-06 02:38:00  IST  )

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (జులై 5) అర్జెంటీనా చేరుకున్నారు.

అర్జెంటీనాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ (జులై 5) అర్జెంటీనా (Argentina) చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనాలోని ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్-టొబాగోలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న తర్వాత, ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ అర్జెంటీనాకు చేరుకున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే(Xavier Miley) ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

కాగా, మోడీ ప్రధాని అయిన తర్వాత ఇది అర్జెంటీనాకు రెండో పర్యటన. అంతకుముందు, 2018లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన అర్జెంటీనా వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, భారతదేశం-అర్జెంటీనా మధ్య రక్షణ, వ్యవసాయం, ఇంధనం, అణు సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య లిథియం సరఫరాపై ఒప్పందం కూడా సాధ్యమే. అర్జెంటీనా ప్రపంచంలో మూడవ అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది.

Next Story