- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నీళ్లు మాకే.. ఎవరికీ ఇచ్చేది లేదు.. పాక్‌కు సింధు జలాల నిలిపివేతపై స్పందించిన ప్రధాని మోడీ
పాకిస్తాన్(Pakistan)కు సింధు నది జలాల(Indus Water) నిలిపివేతలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) తొలిసారి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan)కు సింధు నది జలాల(Indus Water) నిలిపివేతలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) తొలిసారి స్పందించారు. మంగళవారం ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ప్రధాని మాట్లాడుతూ.. గతలంలో భారత జలాలు బయటి దేశాలకు వెళ్లేవి.. ఇప్పుడు మన దేశంలో ప్రవహించే నీరంతా మన దేశంలోనే ఉంటాయి.. మన అవసరాలకే వాడుకుందామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. మన దేశంలోని జలాలను దేశీయ అవసరాలకే వినియోగిస్తామని ప్రకటించారు. ‘మన దేశం- మన నీళ్లు- మన హక్కు’ అని నినదించారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంది. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమని నిర్ధారించిన కేంద్రం.. పాక్‌పై ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం భారత్‌తో ఆర్థిక సంబంధాలతో పాటు అన్ని బంధాలను తెంచుకున్నది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఏప్రిల్ 23న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.






