పహల్గామ్ ఎఫెక్ట్.. మెడీ రష్యా పర్యటన రద్దు!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-30 15:30:14  IST  )

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి కార‌ణంగా ప్ర‌ధాని మెడీ త‌న‌ ర‌ష్యా ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. మే9న మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు హాజరవ్వాలని మోడీకి ఆహ్వానం అందింది.

పహల్గామ్ ఎఫెక్ట్.. మెడీ రష్యా పర్యటన రద్దు!
X

దిశ,వెబ్ డెస్క్: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి కార‌ణంగా ప్ర‌ధాని మెడీ త‌న‌ ర‌ష్యా ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. మే9న మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు హాజరవ్వాలని మోడీకి ఆహ్వానం అందింది. కానీ ఉగ్రదాడి తరవాత నెలకొన్న పరిస్థితులు, వరుస సమావేశాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి వెన‌క పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని తేలిపోయింది. దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని ఎన్ఐఏ అనుమానిస్తోంది.

లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ ఈ దాడిలో కీలక పాత్ర పోశించినట్టు భావిస్తున్నారు. ఫరూక్ కశ్మీర్ నుండి పారిపోయి పాకిస్థాన్‌లో స్థిరపడినట్టు సమాచారం. ఇటీవలే భద్రతా బలగాలు కశ్మీర్ లోని అతడి ఇంటిని పేల్చేశాయి. ఫరూక్‌కు కశ్మీర్‌లోని కొండలు, లోయలపై పూర్తిగా పట్టు ఉంది. ఆయనకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో బలమైన సంబంధాలు ఉండటంతో అతడే ఈ కుట్రకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫరూక్ పాకిస్థాన్‌లో స్థిరపడినా కశ్మీర్‌లో తన కార్యకలాపాలు కొనసాగించేందుకు సెక్యూర్డ్ యాప్స్ వినియోగిస్తూ ఉగ్రవాదులకు టచ్‌లో ఉన్నట్టు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

Read Also..

caste census: మోడీతో మోహన్ భగవత్ భేటీ తర్వాత కులగణనపై సంచలన నిర్ణయం.. ప్రతిపక్షాలపై బీజేపీ ఖతర్నాక్ ప్లాన్?

Next Story