Pm modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. అలస్కా భేటీపై సంభాషణ

by B.Srinivas |

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంపుతో ఇటీవల జరిగిన భేటీ వివరాలను మోడీకి వివరించారు.

Pm modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. అలస్కా భేటీపై సంభాషణ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Puthin) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపుతో ఇటీవల అలస్కాలో జరిగిన భేటీ వివరాలను పుతిన్ మోడీకి వివరించారు. అనంతరం తన సమావేశం వివరాలను తెలియజేసినందుకు పుతిన్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్, రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపైనా చర్చించారు. ‘నా స్నేహితుడు పుతిన్ ఫోన్ చేసి అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్‌తో వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ నిరంతరం పిలుపునిచ్చింది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని నిరంతర సంభాషణల కోసం ఎదురు చూస్తున్నా’ అని ఫోన్ కాల్ అనంతరం మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా, ఈ నెల15న అలాస్కాలో ట్రంప్‌తో పుతిన్ సమావేశమైన విషయం తెలిసిందే.

Next Story