- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ.. రేపు ఏఐ సదస్సుకు హాజరు
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ప్యారిస్‌కు చేరుకున్న మోడీకి అక్కడి ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సోమవారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ప్యారిస్‌కు చేరుకున్న మోడీకి అక్కడి ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం జరిగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సమావేశానికి మోడీ హాజరుకావడంతో పాటు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లో కొత్త రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బుధవారం అతను మజార్గ్స్ యుద్ధ శ్మశానవాటికను సందర్శించి రెండు ప్రపంచ యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికులకు నివాళులర్పించనున్నారు. కాగా, ప్రధాని మోడీ ఫ్రాన్సులో పర్యటించడం ఇది ఏడోసారి. అంతకుముందు 2023లో జాతీయ దినోత్సవం (బాస్టిల్ డే) కార్యక్రమంలో పాల్గొనడానికి ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఫ్రాన్స్ కు బయలుదేరే ముందు ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోడీ అమెరికాకు వెళ్లి నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో భేటీ కానున్నారు.






