- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: అమెరికాకు చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ అంశాలపై ప్రెసిడెంట్ ట్రంప్‌తో కీలక భేటీ!
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యూఎస్ మిలటరీ (US Military)తో పాటు ప్రభుత్వ వర్గాలు ఘన స్వాగతం పలికారు. గడ్డకట్టే చలిలో కూడా వాషింగ్టన్ డీసీ (Washington DC)లో ప్రవాస భారతీయులు ‘వెల్ కం టూ అమెరికా’ (Welcome to America) ప్లకార్డులను చేతబట్టుకుని గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రధాని మోడీ తన ‘X’ (ట్విట్టర్)లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేశారు. అదేవిధంగా భారత్ (India)- అమెరికా (America) భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ (Indian Ministry of External Affairs) ప్రతినిధులు పేర్కొన్నారు.
రెండు రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కాంగ్రెస్ చట్టసభ సభ్యులు, పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. మొదట అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (America's Director of National Intelligence) తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)తో మోదీ భేటీ అయినట్లుగా ఆయన ‘X’ వేదికగా తెలిపారు. ఇదే పర్యటనలో మోదీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)తో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ లింక్ (Star Link) సేవలపై ఆయనతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వలసదారుల అంశంపై కీలక చర్చలు జరుపనున్నారు.
కాగా, అంతకు ముందు ఫ్రాన్స్ (France) పర్యటనలో భాగంగా మార్సెయిల్ (Marseille)లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రధాని మోడీ, అధ్యక్షుడు మేక్రాన్ (Macron) కలిసి ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారక స్థూపాన్ని నిర్మించింది. ప్రధాని మోడీ అక్కడి వెళ్లి అమర వీరులకు నివాళులర్పించారు. కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ యుద్ధ స్మారక స్థూప నిర్వహణ బాధ్యతలను తీసుకుంది.






