- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ.. సోమనాథ్ ఆలయం సందర్శన
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఆదివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని (Somanath temple) సందర్శించారు. అక్కడ ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాస స్థలం అయిన గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన జునాగఢ్ జిల్లాలోని సాసన్‌కు వెళ్లారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లో అనేక కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం ‘వంతరా’ను సందర్శించారు. సోమవారం సైతం మోడీ పలు కీలక ప్రోగ్రామ్స్‌కు హాజరు కానున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాసన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణుల బోర్డు (ఎన్‌బీడబ్ల్యుఎల్) సమావేశానికి మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మోడీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పవిత్ర మాసం ప్రతిబింబం, కృతజ్ఞత భక్తికి ప్రతీక. కరుణ, దయ,సేవల విలువలను మనకు గుర్తు చేస్తుంది. రంజాన్ మాసం ప్రారంభం కానున్నందున సమాజంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలి’ అని పేర్కొన్నారు.






