అర్బన్‌ నక్సలైట్లకు నిద్ర కరువైంది: ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ప్రచారంలో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొన్నారు.

అర్బన్‌ నక్సలైట్లకు నిద్ర కరువైంది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ప్రచారంలో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొన్నారు. రాజధాని పట్నా సిటీలో మోడీ రోడ్‌ షో చేశారు. రోడ్‌ షోకు భారీగా జనం హాజరయ్యారు. మోడీ, మోడీ అంటూ జనం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మావోయిస్టుల నుంచి బిహార్‌కు విముక్తి కల్పించామని కీలక వ్యాఖ్యలు చేశారు. పగలూ.. రాత్రీ లేకుండా పనిచేసినట్లు తెలిపారు. మావోయిస్టుల కథ ముగియడంతో సిటీల్లో ఉన్న అర్బన్‌ నక్సలైట్లకు నిద్ర కరువైందని ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల హింస నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని అన్నారు. ఇందుకు తాను హామీ ఇస్తున్నానని ఒకప్పుడు దేశవ్యాప్తంగా 125 వరకు మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉంటే, వాటిని మూడుకు పరిమితం చేశామని చెప్పారు. త్వరలో ఆ మూడు జిల్లాలకు కూడా విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.

Next Story