- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి : ప్రధాని మోదీ
by Naga Rani Yarlagadda |
ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షించారు

X
దిశ, వెబ్‌డెస్క్: 2025కు వీడ్కోలు పలికి.. కొత్త ఆశలతో ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 2026లో దేశ ప్రజలు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సమాజమంతా శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో రాసుకొచ్చారు.
Next Story






