- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: సౌదీలో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు కుదిరే చాన్స్ !
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు.

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సౌదీ అరేబియా (Saudi arebia) కు వెళ్లారు. ఆ దేశంలోని జెడ్డాలో మోడీ విమానం ల్యాండ్ కాగానే ఆయనకు ఘన స్వాగతం పలికారు. 21 తుపాకులతో గన్ సెల్యూట్ ఇచ్చారు. అలాగే ఓ స్థానిక వ్యక్తి మోడీని ఇన్వైట్ చేసేందుకు ఏ వతన్, ఏ వతన్ అనే భారతీయ పాటను పాడారు. అంతకుముందు మోడీ ఫ్లైట్ సౌదీ గగన తలంలోకి చేరుకోగానే సౌదీకి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాలు గౌరవంగా స్వాగతించాయి. ‘నేను సౌదీ అరేబియాలోని జెడ్డాలో అడుగుపెట్టాను. ఈ పర్యటన భారత్, సౌదీ దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేస్తుంది. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని జెడ్డాకు చేరుకున్నాక మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సుమారు ఆరు అవగాహన ఒప్పందాలు జరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో జరిగే సమావేశంలో ఈ అగ్రిమెంట్ కుదరనుంది. స్పేస్, ఎనర్జీ, ఆరోగ్యం, సైన్స్, శాస్త్రీయ పరిశోధన, అధునాతన సాంకేతికతతో సహా వివిధ రంగాల్లో ఒప్పందం కుదరనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, సౌదీ జైళ్లలో ఉన్న భారతీయ పౌరులు, హజ్ యాత్రలో భారతీయుల కోటా వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
40 ఏళ్ల తర్వాత జెడ్డాలో పర్యటించిన పీఎంగా రికార్డ్
40 ఏళ్ల తర్వాత జెడ్డాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోడీ ఘనత సాధించారు. గతంలో మూడు సార్లు సౌదీలో పర్యటించినప్పటికీ సౌదీ రాజధాని రియాద్‌లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు 1982లో ఇంధిరా గాంధీ జెడ్డాను సందర్శించారు. ఆ తర్వాత జెడ్డాను సందర్శించింది ప్రధాని మోడీనే కావడం గమనార్హం. కాగా, సౌదీ అరేబియా భారతదేశానికి మూడో అతిపెద్ద ముడి చమురు, ఎల్పీజీ సరఫరాదారుగా ఉంది.






