- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pm modi: జెలెన్ స్కీతో మోడీ ఫోన్ సంభాషణ.. ఉక్రెయిన్ యుద్ధంపై డిస్కషన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో సంభాషించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో సంభాషించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడులు గురించి జెలెన్ స్కీ మోడీకి వివరించారు. శాంతి కోసం దౌత్యపరమైన అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, రష్యా తన దురాక్రమణ ప్రయత్నాలను కొనసాగిస్తోందని, కాల్పుల విరమణకు అంగీకరించడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. భారత్ తమ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తోందని చెప్పారు. ‘భారత్ తమ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఉక్రెయిన్‌కు సంబంధించిన ప్రతి అంశం ఉక్రెయిన్ భాగస్వామ్యంతోనే నిర్ణయించబడాలి. ఇతర ఫార్మాట్‌లు ఫలితాలు ఇవ్వవు’ అని జెలెన్ స్కీ తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించడం, యుద్ధాన్ని తీవ్రతరం చేసే దాని సామర్థ్యాన్ని తగ్గించడానికి రష్యా చమురు ఎగుమతులను పరిమితం చేయడం గురించి కూడా మోడీతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఈ సంభాషణను మోడీ అధికారికంగా ధ్రువీకరించారు. ‘జెలెన్ స్కీతో మాట్లాడటం, ఇటీవలి పరిణామాలపై ఆయన అభిప్రాయాలను తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. వివాదానికి ముందస్తు, శాంతియుత పరిష్కారం అవసరం. ఈ విషయంలో భారత్ దృఢమైన వైఖరిని తెలియజేశా. సాధ్యమైన సహకారాన్ని అందించడానికి, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇండియా కట్టుబడి ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌లు భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ మోడీతో మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.






