- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: రేపటి నుంచి మోడీ విదేశీ ప్రయాణం.. ఆ దేశంలో తొలిసారి పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఈనెల 9 వరకు ఐదు దేశాలను సందర్శించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఈనెల 9 వరకు ఐదు దేశాలను సందర్శించనున్నారు. ఘనా నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో మోడీ పర్యటిస్తారు. గత పదేళ్లలో మోడీకి అత్యంత సుదీర్ఘ పర్యటన ఇదే కావడం గమనార్హం. మొదటగా ఘనా వెళ్లనున్న మోడీ అక్కడి నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకుంటారు. అనంతరం అర్జెంటీనా, బ్రెజిల్ వెళ్తారు. బ్రెజిల్‌లో 17వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. చివరగా నమీబియాలో పర్యటిస్తారు.
మొదటి సారి ఘనాకు
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఘనాను సందర్శించడం ఇదే మొదటి సారి. అలాగే గత 30 ఏళ్లలోనే భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ప్రధాని మోడీ వ్యాక్సిన్ హబ్‌ను పరిశీలిస్తారు. అలాగే ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేగాక ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేస్సార్ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ పర్యటన జరుగుతుంది. ఇది కూడా 25 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన కానుంది. దీంతో ఈ రెండు దేశాల పర్యటనపై ఆసక్తి నెలకొంది.






