PM Modi: విందులో పాల్గొన్న మోడీ యూనస్.. బంగ్లాదేశ్ అల్లర్ల అనంతరం ఇదే తొలిసారి

by B.Srinivas |

రెండు రోజుల థాయిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌తో ఓ విందులో పాల్గొన్నారు.

PM Modi: విందులో పాల్గొన్న మోడీ యూనస్.. బంగ్లాదేశ్ అల్లర్ల అనంతరం ఇదే తొలిసారి
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల థాయిలాండ్ (Thailand) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ (Mohammad yunus)తో ఓ విందులో పాల్గొన్నారు. బిమ్ స్టెక్ (Bimstec) సమావేశానికి ముందు థాయిలాండ్ ప్రధాని షినవత్రా (Shinavathra) ఇచ్చిన విందులో మోడీ, యూనస్‌, నేపాల్ ప్రధాని పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టాక మోడీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శుక్రవారం బిమ్ స్టెక్ సమావేశం అనంతరం ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.

కాగా, యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా కూడా యూనస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ యూనస్ ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేగాక ప్రధాని మోడీ నేపాల్ ప్రధాని కేపీ ఓలితోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Next Story