Pm modi: ఆగస్టు 31న మోడీ, జిన్‌పింగ్ భేటీ.. ట్రంప్ టారిఫ్‌ల వేళ కీలక పరిణామం

by B.Srinivas |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు ఈ నెల 31న భేటీ కానున్నారు.

Pm modi: ఆగస్టు 31న మోడీ, జిన్‌పింగ్ భేటీ.. ట్రంప్ టారిఫ్‌ల వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) , చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ (jinping) లు ఈ నెల 31న భేటీ కానున్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంగై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా వీరిద్దరి మధ్య సమావేశం జరగనుంది. ఇరు దేశాల సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. గత ఏడేళ్లలో ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది రెండో సమావేశం. అంతకుముందు గతేడాది బ్రిక్స్ (BRICS) సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్ నగరంలో కలిశారు.

కాగా, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని టియాంజిన్ (TIYANJIN) సిటీలో ఎస్సీఓ సదస్సు జరగనుంది. 20 దేశాలకు పైగా నాయకులు ఇందులో పాల్గొంటారు. జిన్ పింగ్ తో సమావేశం తర్వాత మోడీ సెప్టెంబర్ 1న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అమెరికా సుంకాల వేళ జిన్ పింగ్, పుతిన్‌లతో మోడీ సమావేశం కావడంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రధాని మోడీ గురువారం రాత్రి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

Next Story