- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: డిఫెన్స్ సెక్రటరీతో ప్రధాని మోదీ భేటీ
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతిచర్య ఎలా ఉండాలనే విషయాన్ని చర్చించేందుకు డిఫెన్స్ సెక్రటరీని ప్రధాని మోదీ కలిశారు.

దిశ నేషనల్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావొచ్చని పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోమవారం నాడు రక్షణశాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్‌ను (Rajesh Kumar Singh) భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కలవడం చర్చనీయాంశంగా మారింది. 30 నిమిషాలకుపైగా వీరిద్దరి మధ్య కీలకమైన చర్చలు జరిగినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్స్‌ను ప్రధాని మోదీ కలిశారు. ఈ దాడి చేయించింది పాకిస్తానే అనే భావిస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి ప్రతిచర్యలు తీసుకోవాలనే విషయంపై డిఫెన్స్ అధికారులతో మోదీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్‌ను మోదీ కలిశారు.
పన్నెండు రోజుల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా.. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరైనా సరే వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. అలాగే భారత్‌లో ఉన్న పాకిస్తానీల వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలను ఖండించిన పాకిస్తాన్.. తమ దేశానికి నీటి సరఫరా ఆపేస్తే దాన్ని యుద్ధచర్యగా పరిగణిస్తామని, సిమ్లా ఒప్పందం సహా భారత్‌తో ఉన్న అన్ని రకాల సంబంధాలను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.






