అదానీ కోసమే ప్రధాని మోడీ పని చేస్తున్నారు.. రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-31 08:10:15  IST  )

భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)లో ఏ కోశాన లేదని.. కేవలం ఆయన అదానీ (Adani) సంపదను రెట్టింపు చేసేందుకు మాత్రమే పని చేస్తున్నారని లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు.

అదానీ కోసమే ప్రధాని మోడీ పని చేస్తున్నారు.. రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)లో ఏ కోశాన లేదని.. కేవలం ఆయన అదానీ (Adani) సంపదను రెట్టింపు చేసేందుకు మాత్రమే పని చేస్తున్నారని లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ లోక్‌సభకు హాజరైన ఆయన మీడియా మాట్లాడుతూ.. అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్తపై ఊహించని రీతిలో తీవ్ర ప్రభావం పడబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ (BJP) పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరి సర్వనాశనం అయిందని ధ్వజమెత్తారు. కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, అదానీ సంపదను రెట్టింపు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని మండిపడ్డారు. విదేశాంగ విధానం పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

Next Story