- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంసద్ ఖేల్ మహోత్సవ్: యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపిన ప్రధాని మోడీ
దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'సంసద్ ఖేల్ మహోత్సవ్' (2025) ముగింపు వేడుకల నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'సంసద్ ఖేల్ మహోత్సవ్' (2025) ముగింపు వేడుకల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువ అథ్లెట్లతో వర్చువల్‌గా ముచ్చటించారు. నేటి యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, క్రమశిక్షణే రేపటి 'వికసిత భారత్'కు అసలైన బలం అని ఆయన కొనియాడారు. కేవలం మైదానంలో పతకాలు గెలవడమే కాకుండా, క్రీడల ద్వారా లభించే ఆత్మవిశ్వాసాన్ని జీవితంలోనూ విజయాలు సాధించేందుకు ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. డిసెంబర్ 23 నుంచి 25 వరకు జరిగిన ఈ క్రీడా సంబరాలు గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు యువ క్రీడాకారులతో ప్రధాని సరదాగా సంభాషించి వారిలో స్ఫూర్తిని నింపారు. అస్సాంలోని దర్రాంగ్-ఉదల్గురి నియోజకవర్గానికి చెందిన శాంతి కుమారి అనే కబడ్డీ ప్లేయర్‌తో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు మరియు ఆమె క్రీడా భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సైకిల్ పోలో మరియు కబడ్డీ రెండు క్రీడల్లోనూ రాణిస్తున్న 14 ఏళ్ల బాలికను అభినందిస్తూ, సరైన సమయంలో ఒకే క్రీడపై దృష్టి సారించాలని సూచించారు. నీరజ్ అనే యువ బాక్సర్‌తో మాట్లాడుతూ.. "నువ్వు దేశం కోసం మెడల్ తీసుకువస్తావని నమ్మవచ్చా?" అని అడిగి నవ్వులు పూయించారు. ప్రభుత్వం క్రీడాకారుల డైట్, శిక్షణ బాధ్యతలను తీసుకుంటుందని, వారు కేవలం సాధన పైనే దృష్టి పెట్టాలని ప్రధాని భరోసా ఇచ్చారు.
చివరగా, సంసద్ ఖేల్ మహోత్సవం అనేది కేవలం పోటీల వేదిక మాత్రమే కాదని, ఇది యువతలో టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఒక గొప్ప ఉద్యమమని ప్రధాని అభివర్ణించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో, ఇలాంటి గ్రామీణ స్థాయి క్రీడా వేదికల ద్వారా వెలుగులోకి వచ్చే ప్రతిభావంతులే రేపటి భారత ఒలింపిక్ ఛాంపియన్లని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్‌లు, స్పేస్, సైన్స్ మరియు స్పోర్ట్స్.. ఇలా ప్రతి రంగంలో భారతీయ యువత తమ జెండాను ఎగురవేస్తున్నారని ప్రశంసిస్తూ, క్రీడాకారులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.






