- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి.. ప్రధాని మోడీ
ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి అవలంభిస్తుందని ఆపరేషన్ సిందూర్‌తో ఈ విషయాన్ని చాటి చెప్పామని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి అవలంభిస్తుందని ఆపరేషన్ సిందూర్‌తో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) నొక్కి చెప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు, మహాత్మా గాంధీల మధ్య జరిగిన సంభాషణ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. పాకిస్తాన్‌తో ఘర్షణ సమయంలో దేశంలో తయారు చేయబడిన ఆయుధాలు వాటి ప్రభావాన్ని చూపించాయని కొనియాడారు. భారతీయుల రక్తాన్ని చిందించాలనుకునే వారికి ఏ ప్రదేశం సురక్షితంగా లేదని, ఇటీవలే ఈ విషయం స్పష్టమైందన్నారు. వివక్ష లేని, బలమైన భారత్‌ను కోరుకునే వ్యక్తుల ఆదర్శాలపై భారత్ పని చేసిందని నొక్కి చెప్పారు.
గత 11 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాల్లో భారతదేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసిందన్నారు. భారత్ తన రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడటం తగ్గుతోందని, రక్షణ రంగం ఆత్మనిర్భర్‌గా మారుతోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం 22 నిమిషాల్లోనే శత్రువులను మోకరిల్లేలా చేసిందని చెప్పారు. దేశీయంగా తయారైన ఆయుధాలతోనే దాయాదికి చుక్కలు చూపించామని, భవిష్యత్‌లో మన వెపన్స్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.






