- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pm modi: భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు భేష్.. ప్రధాని మోడీ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలు ఉన్నప్పటికీ భారత్ 7.8 శాతం వృద్ధి రేటు సాధించిందని ప్రధాని మోడీ కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలు ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి రేటు సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) కొనియాడారు. ఆర్థిక స్వార్థం వల్లే సవాళ్లు తలెత్తుతున్నాయని, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సత్తా చాటిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన సెమికాన్ ఇండియా (Semicon india) 2025 ప్రారంభ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని, ఇండియాతో కలిసి సెమీ కండక్టర్ రంగంలో రాణించడానికి ప్రపంచం సిద్ధంగా ఉందన్నారు. ‘సెమీకండక్టర్ ప్రపంచంలో చమురు నల్ల బంగారం అని చెబుతారు. గత శతాబ్దం మొత్తం చమురుతో రూపుదిద్దుకుంది. కానీ 21వ శతాబ్దపు శక్తి చిన్న చిప్‌కి మాత్రమే పరిమితం. ఈ చిప్ చిన్నదే కావచ్చు కానీ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తి దానికి ఉంది’ అని అన్నారు.
2021లో సెమికాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభి 2023 నాటికి దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. 2024 లో అదనపు ప్లాంట్‌లను ఆమోదించామని, మొత్తంమీద పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. ఇది భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తుందన్నారు.భారత్ ఇప్పుడు బ్యాక్‌ఎండ్ నుంచి పూర్తి స్థాయి సెమీకండక్టర్ దేశంగా మారే మార్గంలో ఉందని, పెట్టుబడిదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.






