Pm modi: జీఎస్టీ సంస్కరణలను సకాలంలో అమలు చేయాలి.. ప్రధాని మోడీ

by B.Srinivas |

జీఎస్టీ సంస్కరణలను సకాలంలో అమలు చేయాలని ప్రధాని మోడీ అన్నారు. దీపావళికి ముందే ఈ ప్రతిపాదనలను ఇంప్లిమెంట్ చేయాలని కోరారు.

Pm modi: జీఎస్టీ సంస్కరణలను సకాలంలో అమలు చేయాలి.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలను సకాలంలో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. తదుపరి జీఎస్టీ సంస్కరణలను కేంద్రం రాష్ట్రాలకు అందజేసిందని, దీపావళికి ముందే ఈ ప్రతిపాదనలను ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రెండు ఎక్స్ ప్రెస్ వే (Express way) లను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. జీఎస్టీ రీఫామ్స్ పేద, మధ్యతరగతి ప్రజలకు, చిన్న, పెద్ద వ్యాపారాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ చట్టాన్ని సులభతరం చేయడం, పన్ను రేట్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల జీవితం, వ్యాపారం సరళీకృతం అయ్యేలా అనేక కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు.

ఈ దీపావళికి జీఎస్టీ రీఫార్మ్ ద్వారా ప్రజలకు డబుల్ బోనస్ లభిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చొరవకు అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీపావళి పండుగ మరింత అద్భుతంగా జరిగేలా ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీఎస్టీని సులభతరం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించి 5 శాతం, 18 శాతంగా సవరిస్తున్నట్టు తెలిపింది.

Next Story