ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

by Yella Dhawani Reddy |

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు (Spiritual leader) దలైలామా (Dalailama) ఇవాళ తన 90వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు (Spiritual leader) దలైలామా (Dalailama) ఇవాళ తన 90వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా చిహ్నమని అన్నారు.

దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 1.4 బిలియన్ల భారతీయులతో కలిసి తాను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'ఆయన ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు చిరస్మరణీయ చిహ్నం. ఆయన సందేశం అన్ని మతాల ప్రజలలో గౌరవం, ప్రశంసలను ప్రేరేపించింది. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము' అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

కాగా దలైలామా 1935లో టిబెట్‌లోని టక్‌సెర్‌‌లో జన్మించారు. 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాత భారత్‌లో ఆశ్రయం పొంది అప్పటి నుంచి ధర్మశాలలో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస, మానవతా విలువలను ప్రచారం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. దలైలామా జన్మదినం సందర్భంగా మెక్లియోడ్‌ గంజ్‌లోని టిబెటన్లు ఆదివారం నుంచి వారం రోజులపాటు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటారు.

Next Story