4 వందేభారత్ రైళ్లు ప్రారంభం.. కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి: ప్రధాని మోడీ

by Phanindra |

కొత్తగా 4 వందేభారత్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి మొదలవుతుందని ఆయన చెప్పారు.

4 వందేభారత్ రైళ్లు ప్రారంభం.. కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మరో నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. శనివారం నాడు బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఎన్నో దేశాల అభివృద్ధిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషంచిందన్నారు. పట్టణాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తే, అక్కడ అభివృద్ధి దానంతట అదే మొదలవుతుందని ఆయన చెప్పారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం బ్రిడ్జీలు, హైవేలు మాత్రమే కాదన్న ప్రధాని.. తాజాగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లు హెరిటేజ్ సిటీలను కలపడమే కాకుండా, అక్కడ అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. గడిచిన 11 ఏళ్లలో ఉత్తప్రదేశ్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని కొనియాడారు. గతేడాది 11 కోట్ల మంది భ్తులు వారణాసిని సందర్శించారని, 6 కోట్ల మంది వరకు అయోధ్య రాముడిని దర్శించుకున్నారని వెల్లడించారు. ఈ తీర్థయాత్రల వల్ల వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు.

Next Story