- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుపరిపాలన, అభివృద్ధి గెలిచింది: బిహార్ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భారీ మెజార్టీ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భారీ మెజార్టీ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా స్పందించారు. బిహార్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ట్వీట్ లో పేర్కొన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచాయన్నారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పు ప్రజలకు మరింత సేవ చేయడానికి, బిహార్ ను మరింత అభివృద్ధి చేయడానికి కొత్త బలాన్నిస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు.
రాబోయే కాలంలో బిహార్ పురోగతి, మౌలిక సదుపాయాలు అందించేందుకు, అక్కడి సంస్కృతిని కాపాడేందుకు మరింత కృషి చేస్తామన్నారు. రాష్ట్ర యువశక్తి, నారీశక్తికి జీవితం సమృద్ధిగా గడిపేందుకు కావలసిన అవకాశాలను సృష్టిస్తామన్నారు. ఎన్టీయే ట్రాక్ రికార్డ్, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలన్న దార్శనికత ఆధారంగా ప్రజలు తమకు ఓటు వేశారని ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన సీఎం నితీష్ కుమార్, ఎన్డీయే కూటమి సభ్యులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.






