రూ.2,000 నోట్లను ప్రవేశ పెట్టడం ప్రధాని మోడీకి ఇష్టం లేదు: మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ

by Disha Web Desk 12 |
రూ.2,000 నోట్లను ప్రవేశ పెట్టడం ప్రధాని మోడీకి ఇష్టం లేదు: మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2 వేల నోటును ఆర్బీస్ రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకొగా.. దీనిపై దేశం మొత్తం తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ.. మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా సంచలన విషయాలను వెల్లడించారు. 2016 నవంబర్ 8 నుంచి నోట్లు రద్దు చేశారు. అనంతరం కొత్త నోట్లను ముద్రించి ఇచ్చారు. అయితే ఆ సమయంలో 2000 వేల నోటును తీసుకు రావడం ప్రధాని మోడీకి అస్సలు ఇష్టం లేదని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

2000 నోటును తీసుకురావడం.. ప్రధానికి ఇష్టం లేదని.. కానీ అతని బృందం నుంచి సలహా రావడంతో 2000 నోటును తేవడానికి అంగీకరించినట్లు సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆ సమయంలో ఇది స్వల్పకాలిక ఏర్పాటు అని అతను స్పష్టంగా చెప్పాడు" అని మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే 2000 వేల నోటు రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

Read more:

ఇప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యమేనా!?

Next Story

Most Viewed