Pm modi: రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించాలి.. ప్రధాని మోడీ

by B.Srinivas |

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Pm modi: రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించాలి.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించే దిశగా ప్రయత్నాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతతో దేశ ప్రయాణం సాగేలా కృషి చేసిన వారందరికీ నమస్కరిస్తున్నాం. రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించి బలమైన, సంపన్నమైన భారతదేశం కోసం పని చేయడం మా లక్ష్యం’ అని తెలిపారు. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక శైలిలో కనిపించారు. తెల్లటి కుర్తా-పైజామా, ఎరుపు-పసుపు తలపాగాతో ముదురు గోధుమ రంగు క్లోజ్డ్ నెక్ కోట్ ధరించాడు. రాజస్తాన్ సంస్కృతికి ప్రతీకగా ఈ తలపాగా ధరించినట్టు తెలుస్తోంది.

Next Story