అదానీపై యూఎస్‌లో దర్యాప్తు వల్ల.. ట్రంప్‌ను మోడీ ఎదిరించలేడు: రాహుల్ గాంధీ

by Phanindra |   (  Updated:2025-08-06 17:49:41  IST  )

అదానీపై యూఎస్‌లో దర్యాప్తు వల్ల యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను మోడీ ఎదిరించలేడని రాహుల్ గాంధీ విమర్శించారు.

అదానీపై యూఎస్‌లో దర్యాప్తు వల్ల.. ట్రంప్‌ను మోడీ ఎదిరించలేడు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే బెదిరింపులకు ప్రధాని మోడీ ఎదురు చెప్పలేరని, అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుతున్నందు వల్లనే మోడీ మౌనం వహిస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై స్థిరంగా సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. భారత్ మంచి వ్యాపార భాగస్వామిగా లేదని ఆయన ఆరోపించారు.

దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్.. ‘భారత్.. కొంచెం అర్థం చేసుకో. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ ఎదురు నిలబడలేకపోతున్నారు. ఈ ఒక్క బెదిరింపుతో రష్యా చమురు డీల్స్, మోడీ, అంబానీ మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు ఎక్స్‌పోజ్ అయిపోయాయి’ అని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మిగతా వివరారలను ఆయన వెల్లడించలేదు. ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్ స్పందించలేదు.

Next Story