- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: మహాకుంభమేళ ముగిసిన తర్వాత మోదీ సంచలన వ్యాఖ్యలు... క్షమించమని కోరిన ప్రధాని
PM Modi: మహాకుంభమేళా(Mahakubh mela 2025) ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలకు సందేశమిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: PM Modi: మహాకుంభమేళా(Mahakubh mela 2025) ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలకు సందేశమిచ్చారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగి ఈ మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోదీ (PM Modi)తన బ్లాగ్ లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత ఈజీ కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే అందుకు క్షమించాలని కోరారు ప్రధాని మోదీ(PM Modi).
ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతకు కుంభమేళా(Mahakubh mela) నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్(Prayagraj) కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుంది. నవభారత్ ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు ప్రధాని మోదీ.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారంటూ యావత్ ప్రపంచం ఆశ్చర్య పోతోంది .ఈ భక్తులెవరికీ అధికారికంగా ఆహ్వానాలు పంపించలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాల(Mahakubh mela 2025) కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానమాచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు చాలా మంది వ్యయప్రయాలకోర్చి కుంభమేళా(Mahakubh mela 2025)కు రావడం చాలా సంతోషంగా ఉందని మోదీ(PM Modi) చెప్పుకొచ్చారు.
మహాకుంభమేళా(Mahakubh mela 2025)ను సక్సెస్ చేసిన యూపీ సర్కార్, సహకరించిన ప్రయాగ్ రాజ్(Prayagraj) ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం మామూలు విషయం కాదు. మా పూజల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే క్షమించాలని ఆ గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నాను. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నాను అని మోదీ రాశారు.






