Pm modi: వోకల్ ఫర్ లోకల్‌తో మెరుగైన ఫలితాలు.. నెక్స్ట్ సదస్సులో ప్రధాని మోడీ

by B.Srinivas |

భారత్ ప్రస్తుతం ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధాని మోడీ తెలిపారు. కేవలం శ్రామిక శక్తిగానే గాక ప్రపంచ శక్తిగా మారామని కొనియాడారు.

Pm modi: వోకల్ ఫర్ లోకల్‌తో మెరుగైన ఫలితాలు.. నెక్స్ట్ సదస్సులో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ప్రస్తుతం ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తెలిపారు. కేవలం శ్రామిక శక్తిగానే గాక ప్రపంచ శక్తిగా మారుతున్నదని కొనియాడారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన నెక్స్ట్ (NXT) సమావేశంలో మోడీ ప్రసంగించారు. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. దేశం సంస్థాగత , వినూత్న సామర్థ్యాలను చూస్తోందని తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ (Vokal for local) నినాదంతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ల నుంచి విమాన వాహక నౌకల వరకు ప్రతిదీ తయారు చేస్తోందని, భారత్ సాధించిన విజయాలను వివరంగా అధ్యయనం చేసి దేశాన్ని సందర్శించాలని ప్రపంచ నేతలు కోరుకుంటున్నారన్నారు.

60 ఏళ్లలో మొదటిసారిగా దేశంలో ఒక ప్రభుత్వం వరుసగా మూడో తిరిగి ఎన్నికైందని తెలిపారు. దేశం సాధించిన విజయాలపైనే ప్రజా విశ్వాసం ఆధారపడి ఉంటుందన్నారు. గత 11 ఏళ్లలో ‘వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ ఫర్ గ్లోబల్’ నే విజన్‌ను దేశానికి అందించానని, ఇప్పుడు ఆ విజన్ వాస్తవరూపం దాల్చిందని నొక్కి చెప్పారు. భారతదేశం ప్రపంచానికి ఉత్పత్తులను అందించడమే గాక ప్రపంచ సరఫరా గొలుసులో విశ్వసనీయమైన భాగస్వామిగా కూడా మారుతోందని వ్యాఖ్యానించారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Next Story