ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మోడీ మోటివేషన్.. ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు క్రేజీ ఆన్సర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-09 10:58:17  IST  )

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మోడీ మోటివేషన్.. ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు క్రేజీ ఆన్సర్
X

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha) కార్యక్రమంలో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక దిశానిర్దేశం చేశారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే గొప్ప విజయాలు సాధించడం సాధ్యం అవుతుందని అన్నారు. విద్యార్థులు ఫోన్లు, టీవీలకు బానిసలు కావొద్దని సూచించారు. మంచిదారిలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. టెక్నాలజీనే మిమ్మల్ని బానిసలుగా చేసుకునే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోవద్దని నొక్కి చెప్పారు. ఆచరణలో క్రమశిక్షణ లేకపోతే సత్ఫలితాలు పొందలేరని అన్నారు. సమయపాలన, స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణే మన ప్రేరణను అర్థవంతమైన ఫలితాలుగా మారుస్తుందని చెప్పారు.

ఆ భయం నిజమేనా..?

ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయాలు నిజమేనా..? అని ఓ విద్యార్థిని మోడీని ప్రశ్నించింది. దీనికి మోడీ స్పందిస్తూ.. సాంకేతికత మన పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఏఐకి విద్యార్థులు భయపడాల్సిన పనిలేదన్నారు. టెక్నాలజీతో ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. జీవితంలో ఏదీ సులువుగా ఉండదన్నారు. విధివిధానాలకు ఎన్నటికీ భయపడకూడదని చెప్పారు. విధేయత, నిబద్ధతతో పనిచేయాలన్నారు. నిలకడగా సరైన పని చేయడమే నిజమైన నాయకత్వమని చెప్పారు.

Next Story