- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ !
ప్రధాని నరేంద్ర మోడీ తో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం భేటీ అయ్యారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar preeth singh) ఆదివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని పీఎం నివాసంలోనే ఈ సమావేశం జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. భేటీకి సంబంధించిన అధికారిక వివరాలు బహిర్గతం కానప్పటికీ ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. దాడిపై ప్రతికారం తీసుకునేందుకు తీసుకునే చర్యలపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి (Dinesh tripati) మోడీని కలిసిన మరుసటి రోజే ఎయిర్ చీఫ్ మార్షల్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం మోడీ త్రివిధ దళాలతో భేటీ అయి ఉగ్ర చర్యలపై నిర్ణయాన్ని సైన్యానికి వదిలేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్రివిధ దళాదిపతులతో వేర్వేరుగా భేటీ అవుతుండటం గమనార్హం.
Next Story






