- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఖాతాలో జమ అయ్యాయా?లేదా? చెక్ చేసుకోండిలా
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana) పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల నిధులు రైతులకు అందాయి. ఇక రక్షాబంధన్ సందర్భంగా పీఎం మోడీ వారాణాసి పర్యటనలో భాగంగా 20వ విడత రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా?లేదా చెక్ చేసుకొండిలా..
* పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
* బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబరును ఎంటర్ చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.
* స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
* ఒకవేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు జమకావు.






