- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరోతో విజయ్ బయోపిక్‌కు ప్లాన్.. హీరోయిన్ ఎవరంటే?
ఏదైనా చరిత్ర క్రియేట్ చేశారంటే చాలు బయోపిక్ తీసేందుకు డైరెక్టర్లు రెడీగా ఉంటారు. గెలిచిన వాళ్ల స్టోరీ ఎప్పుడూ ఆసక్తిగా, మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా ఎగబడి చూసేస్తారు.

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా చరిత్ర క్రియేట్ చేశారంటే చాలు బయోపిక్ తీసేందుకు డైరెక్టర్లు రెడీగా ఉంటారు. గెలిచిన వాళ్ల స్టోరీ ఎప్పుడూ ఆసక్తిగా, మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా ఎగబడి చూసేస్తారు. సక్సెస్ స్టోరీలు కాబట్టి చిన్నపిల్లలను తీసుకెళ్లి కూడా చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయ్ బయోపిక్ తీసేందుకు కూడా ప్లాన్స్ చేస్తున్నారట. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విజయ్ పాత్రలో నటిస్తారని.. ఇప్పటికే బయోపిక్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషనే తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అక్షయ్ కుమార్ నిజంగానే విజయ్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా లేదంటే అభిమానులు విజయ్ బయోపిక్ రావాలని కోరుకుంటూ ఇలా ప్రచారం చేస్తున్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి విజయ్ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రభంజనమే. ఈ నేపథ్యంలో సినిమా వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా విజయ్ బయోపిక్ వస్తుందా లేదా అనేది చూడాలి మరి .






