- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash: ప్రపంచంలోనే సేఫ్ ఎయిర్ క్రాప్ట్.. కానీ ఆ వైఫల్యంతోనే ప్రమాదం?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనకు గల కారణాలపై అందరి దృష్టి పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన ఏఐ 171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing 787-8) విమానం కూలిపోయిన ఘటన అందరిని షాక్‌కు గురి చేస్తోంది. 242 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఈ విమానం నిమిషాల వ్యవధిలోనే కుప్పుకూలి కాలిబూడిదగా మారడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఈ ప్రమాదంలో 110 మంది చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో రెండు భారీ భవనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో 20 మందికి పైగా మెడికోలు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రాణనష్టంపై పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. అయినా విమానంలో ఉన్న వారిలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదనేది ప్రమాద తీవ్రతను చూస్తే అర్థమవుతున్నది. అయితే ఈ ప్రమాదానికి డబుల్ ఇంజిన్ల వైఫల్యమే కారణం అయి ఉంటుందనే వాదన తెరపైకి వస్తోంది. విమానంలో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్ తో సెఫ్ గా ల్యాండిగ్ చేయొచ్చు అని కానీ అలా జరగలేదంటే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయి ఉండొచ్చని నిపులుణులు చెబుతున్నారు.
విమానంలో విజయ్ రూపానీ లేరు
ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) ఉన్నారన్న ప్రచారంపై ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. ఈ విమానంలో ఆయన ప్రయాణించలేదని స్పష్టం చేశారు. ఆయన అంతకముందే వేరే విమానంలో లండన్ వెళ్లారని చెబుతున్నారు. కానీ, ఈ విమానం ప్రయాణికుల జాబితాలో మాత్రం విజయ్ రూపానీ పేరు ఉండటం గమనార్హం. అయితే విమానంలోని ప్రయాణికులు క్షతగాత్రులను తరలిస్తున్న ఆస్పత్రుల వద్దకు చేరుకుని సెండ్‌ఆఫ్ ఇచ్చిన కాసేపటికే తమకు ఈ సమాచారం తెలిసిందని రోధిస్తున్నారు.
సేఫ్ ఫ్లైట్..
ప్రమాదానికి గురైన 787-8 విమానాల సిరీస్‌ను 2011లో బోయింగ్ ప్రవేశపెట్టింది. డ్రీమ్ లైనర్ సిరీస్‌లోని మోడల్ అని తెలుస్తోంది. దీన్ని ప్రపంచంలోని ఎయిర్‌లైన్స్ సంస్థలు సుదూర, ఖండాంతరాల ప్రయాణాల కోసం విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ ఈ సిరీస్‌కు చెందిన విమానాలు దాదాపు 2,200 తయారు చేయగా వీటిలో ప్రస్తుతం 1,189 విమానాలు సేవలు అందిస్తున్నట్లు విమానరంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎయిర్ లైన్ కాన్ఫిగరేషన్‌ను బట్టి 242 నుంచి 290 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలిగే అవకాశం ఉన్న ఈ విమానాలు.. 13,530 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్‌గా ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. 50 శాతం మిశ్రమ పదార్థాలతో నిర్మించబడిన 787-8 తేలికైన ఫ్రేమ్ కలిగి ఉంటుంది. సింథటిక్ విజన్ సిస్టమ్ తక్కువ ఉన్న స్థితుల్లో పైలట్ పరిస్థితుల అవగాహనను పెంచుతూ భూభాగం, అడ్డంకులకు సంబంధించి త్రీడీ వీక్షణను అందించే సాంకేతికత ఈ విమానంలో ఉండడం ప్రత్యేకత.






