- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : విమాన ప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా
అహ్మదాబాద్ లో నేడు భారీ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో నేడు భారీ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Boeing)కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం(Boeing 787-8 Dreamliner Flight) టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని నివాసాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహ 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. కాగా విమాన ప్రమాద స్థలిని కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Sha) పరిశీలించారు. ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.
ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉందని, అయితే DNA టెస్టుల తర్వాతే మరణించిన వారి సంఖ్య స్పష్టంగా చెప్పగలమన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడించారు. అంతకముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులతో సమావేశం నిర్వహించారు.






