- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash: ఆస్పత్రి హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి, 50 మందికి గాయాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని (Gujarath) అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా (Airindia) విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ మధ్యాహ్నం 1:38 నిమిషాలకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ (London) గాట్విక్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా సజీవ దహనం అయినట్లు సమాచారం. మేఘనినగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలేజ్ భవనంతోపాటు.. మరో రెండు భవనాలకు కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మెడికోలు మృతిచెందగా, 50 మంది మెడికోలు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.






