Plane Crash : ప్లేన్ క్రాష్... కుటుంబ సభ్యుల కోసం 2 ప్రత్యేక విమానాలు

by Muthe.Rajitha |

గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది.

Plane Crash : ప్లేన్ క్రాష్... కుటుంబ సభ్యుల కోసం 2 ప్రత్యేక విమానాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Boeing) జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. మొత్తం 254 మందిలో ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడింది ఒక్కరు మాత్రమే. అయితే ఈ ఘటనలోని ప్రయాణికులు, సిబ్బంది కుటుంబ సభ్యులు, బంధువులు కోసం ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలను(Special Flights) నడిపించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అహ్మదాబాద్ కు కేవలం వీరికోసమే ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నట్టు పేర్కొంది.

Next Story